రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ. 800 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. ఎస్. రాయవరంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ రహదారి అభివృద్ధి పనులను సంక్రాంతిలోగా పూర్తి చేయాలన్నారు. అలాగే అచ్యుతాపురం - అనకాపల్లి రహదారి నిర్మాణానికి మంత్రి లోకేశ్ త్వరలో శంకుస్థాపన చేస్తారని అలాగే మిగిలిన రోడ్లను పూర్తి చేస్తామన్నారు.