నక్కపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఈవో పి. అప్పారావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా బోధనపై ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. భోజనం నాణ్యతతో పాటు రుచిగా ఉండాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.