వాయుగుండం కారణంగా నక్కపల్లి మండలంలోని పెదతీనార్ల, దొండవాక, బోయపాడు వద్ద ఆదివారం సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. పెదతీనార్లలో సముద్రతీరం కొంతమేర కోతకు గురైంది. కెరటాలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. అధికారులు హెచ్చరికలు జారీ చేసిన కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడంతో సముద్రతీరం బోసిపోయి కనిపిస్తుంది. బోట్లు, వలలు దెబ్బతినకుండా తుఫాన్ షెల్టర్లలో భద్రపరుచుకున్నారు.