గొలుగొండ మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలపై హత్యాయత్నం జరిగింది. వీరిద్దరూ తీవ్ర గాయాలతో బుధవారం ఉదయం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చినట్లు వైద్యాధికారిణి తెలిపారు. భార్య మహాలక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. ఈమె రెండు చేతులు నరికి వేయడంతో బాగా రక్తస్రావం అవుతుంది. దీంతో విశాఖ కేజిహెచ్ కు తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.