కూలిపోయిన పురాతన భవనం

70பார்த்தது
నర్సీపట్నం మున్సిపాలిటీ వెలంపేట మెయిన్ రోడ్లో ఆదివారం సాయంత్రం పురాతన భవనం కూలిపోయింది. దాదాపు శిథిలావస్థకు చేరిన భవనం కూలిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న మున్సిపల్, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని శకలాలను తొలగించే పనిలో పడ్డారు. ట్రాఫిక్ జామ్ కాకుండా టౌన్ ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி