ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీన బిజెపి కార్యాలయ ప్రాంగణంలో ఖాదీ సంతను నిర్వహించనున్నట్టు బిజెపి జిల్లా అధ్యక్షుడు రవీంద్ర శనివారం తెలిపారు. విశాఖలోని లాసెన్స్ బే కాలనీలో ఉన్న బిజెపి జిల్లా కార్యాలయంలో ఖాదీ సంతను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చేనేత కళాకారులు, హస్త కళాకారులను ప్రోత్సహించాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు.