రాష్ట్ర మాలల ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు దళితుల వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జయప్రదం చేసే సందర్భంగా గురువారం షాద్ నగర్ నుండి నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని పోలీసులు ముందుగానే అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేయబడిన వారిలో ఎం. జనార్ధన్, అర్జున్ కుమార్, టెలిఫోన్ వెంకటయ్య, డాక్టర్ బుచ్చయ్య, మహేష్ మాల, తదితరులు ఉన్నారు.