షాద్‌నగర్ పట్టణం ప్రభుత్వ జూనియర్ రోడ్డు రోజు వందల సంఖ్యలో వాహనాలు ఈ మార్గం గుండా వస్తూ వెళ్తూ ఉంటాయి. ఈ రహదారి మధ్యలో గుర్తుతెలియని టాటా ఇండికా కారు కొన్ని నెలలుగా పార్కు చేసి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వాహన యజమాని ఎవరో తెలియదు. ఈ కారు పనిచేయడం లేదని వదిలేసి వెళ్లారా లేదంటే గుర్తుతెలియని వాహనాన్ని తెచ్చి ఇక్కడ పార్కు చేశారా అని ఆదివారం స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు.