షాద్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో ప్రముఖ వైద్యుడు, మాజీ రైల్వే బోర్డు మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇరువురు కలిసి నియోజకవర్గ రాజకీయాలపై చర్చించుకున్నారు. ప్రతినిత్యం ఏవో పనుల్లో బిజీగా ఉండే మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, డాక్టర్ చంద్రశేఖర్ల భేటీ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ రాజకీయాల్లో హార్ట్ టాపిక్ గా మారింది.