బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఓ కళాశాల ప్రాంగణంలో ఒక వ్యక్తిపై కొంతమంది దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని బెల్ట్, కర్రలతో కొట్టిన నిందితులు ఉమ్మి నాకమని బలవంతం చేయడం వీడియోలో కనిపించింది. తన కుమారుడి వద్ద రూ.2 వేలు గుంజుకున్నారని బాధితుడి తల్లి ఆరోపించింది. బాధ్యులైన ముగ్గురు వ్యక్తులపై, మరో ఐదుగురు గుర్తుతెలియని అనుమానితులపై కేసు నమోదైంది.