బన్నీని విమర్శించిన ఏసీపీపై చర్యలు: DCP

64பார்த்தது
బన్నీని విమర్శించిన ఏసీపీపై చర్యలు: DCP
అనధికారికంగా ప్రెస్‌‌మీట్ పెట్టి అల్లు అర్జున్‌ను విమర్శించిన ఏసీపీ విష్ణు మూర్తిపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. బన్నీ విచారణ టీంలో లేని ఆయన ఎలా విమర్శిస్తారని ప్రశ్నలు రావడంతో డీసీపీ స్పందించారు. 'విష్ణు ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నారు. తమ అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. బన్నీ వ్యాఖ్యలకు మేం చింతిస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி