మహేశ్వరం: అభివృద్ధి పనులు ప్రారంభం

బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ గాయత్రీనగర్ కాలనీలో ఆదివారం సీసీరోడ్ల నిర్మాణ పనులను మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యతగా పనులు పూర్తిచేసి ప్రజలు, కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అనంతరం కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విచ్చేసిన ముఖ్యులను శాలువాలతో సన్మానించారు.

தொடர்புடைய செய்தி