ఆపదలో ఉన్న జర్నలిస్టులకు భువనగిరి ప్రెస్ క్లబ్ అండగా ఉంటుందని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గంధమల్ల రాజు, కోశాధికారి ఆరే కుమార్ అన్నారు. భువనగిరిలో ఇటీవల అనారోగ్యానికి గురైన దండు క్రిష్ణ, సురుపంగ కుమార్ లకు ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. ప్రెస్ క్లబ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు కూరెళ్ళ మల్లేశం చారి, లక్ష్మీనారాయణ చారి, భువనగిరి కిషన్, షానూర్ బాబా, నిమ్మల సురేష్ గౌడ్, మహేష్ పాల్గొన్నారు.