అస్సాంలోని దిమా హసావ్ జిల్లాలో ఉమ్రాంగ్సో ప్రాంతంలోని బొగ్గు గనిలో కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. గనిలో నీరు ఉప్పొంగి 9 మంది అందులోనే చిక్కుకుపోవడంతో వారికి బయటికి తీసుకొచ్చేందుకు భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. భారీ యంత్రాల ద్వారా రక్షణ చర్యలు చేపట్టాయి.