రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో భేటీ కావాలని కోరుకుంటున్నారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా పుతిన్ సమావేశానికి ఏర్పాటు చేస్తామని రిపబ్లికన్ గవర్నర్లతో భేటీలో వ్యాఖ్యనించారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జనవరి 20న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.