TG: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. 46 తులాల బంగారం, 20 తులాల వెండి రూ. 10 వేలు దుండగులు దొంగిలించారు. డిసెంబర్ 7న అర్థ రాత్రి ఇంట్లో అందరూ నిద్రలో ఉన్న సమయంలో దొంగలు దొంగతనం చేశార. ఒక గదిలో నిద్రిస్తుండగానే మరో గదిలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.