లక్ష ఇళ్లు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి?: కేటీఆర్

78பார்த்தது
లక్ష ఇళ్లు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి?: కేటీఆర్
తమ పార్టీ విధానం నిర్మాణం.. కాంగ్రెస్‌ది విధ్వంసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. ‘‘బీఆర్ఎస్‌ది నిర్మాణం.. కాంగ్రెస్‌ది విధ్వంసం. మా హయాంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టలేదని మభ్యపెట్టారు. మేం కట్టిన ఇళ్లనే మూసీ బాధితులకు కేటాయిస్తున్నారు. లక్ష ఇళ్లు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? మహానగరంలో లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించాం.’’ అని ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్‌ పోస్టు చేశారు.

தொடர்புடைய செய்தி