సున్నా వడ్డీ రుణాలకు గుర్తింపు లేదని RBI ఇదివరకే చెప్పగా, నో-కాస్ట్ EMI అనేది కేవలం ఓ మార్కెటింగ్ ఐడియా అని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ నో-కాస్ట్ EMIలో డీలర్ నుంచి పొందాల్సిన రాయితీని కస్టమర్ కోల్పోతాడు. రుణదాతలు ఈ రాయితీ మొత్తాన్ని వస్తువు ధరకు జోడించి, నో-కాస్ట్ EMIగా వాయిదాలు నిర్ణయిస్తారు. ఈ విధానంలో ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీపై 18% GST, EMI చెల్లింపు ఆలస్యమైతే 30-40% జరిమానా విధిస్తారు.