జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీను గెలిపిస్తే ఏడాదిలో1.5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున సభల్లో పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ నేపథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇటీవల పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపడతామని భరోసా ఇచ్చారు.