గట్టిగా ఉన్న వస్తువులను, సున్నితమైన వస్తువులను వాషింగ్ మెషన్‌లో వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఓవర్ లోడింగ్ కూడా ప్రమాదకరమని, మెషన్ సామర్థ్యానికి అనుగుణంగానే వేయాలని సూచిస్తున్నారు. పిల్లల బట్టలతో కలిపి పెద్దవాళ్ల బట్టలు వేయకూడదని, దాని కారణంగా హానికర క్రిములు వారి బట్టలకు అంటుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వాషింగ్ మెషన్‌కు చల్లని లేదా గోరు వెచ్చని నీటినే ఉపయోగించడం మంచిది.