వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని రాయపర్తి కాట్రపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం గుర్తించిన 33 సన్న రకాలకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. తూకంలో ఎలాంటి అవకతవకలు జరిగిన ఎవరిని ఉపేక్షించేది లేదు అని ఖరాఖండిగా చెప్పారు. ధాన్యం కొన్న రెండు రోజుల్లో పైసలు ఖాతాలో పడతాయని తెలిపారు.