ఐనవోలు మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం పరిశీలించారు. సిఈ కార్యాలయం కోసం ఈ భవనాన్ని కేటాయించేందుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయం గురించిన వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ డిప్యూటీ సీఈవో రవి, పంచాయతీరాజ్ ఇన్చార్జి ఎస్ఈ శంకరయ్య, ఐనవోలు ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.