'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉంటూ మహిళాలోకం ఆడిపాడింది. తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మ పర్వం బుధవారం కన్నులపండువగా ఆరంభమైంది. తొలి నాటి బతుకమ్మ వేడుకలకు నగరంలోని వేయి స్తంభాల, భద్రకాళి ఆలయ ప్రాంగణాలు, పలుచోట్ల గల వివిధ ప్రదేశాలు వేదికలుగా నిలిచాయి.