వరంగల్ నగరంలో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో నేలతల్లి పులకించిపోయింది. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. గురువారం రాత్రి ఖిలవరంగల్, ఉర్సు కాశిబుగ్గ ప్రాంతాల్లో 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. బంగారు గౌరమ్మ ఉయ్యాలో. ' అంటూ పాటలతో హోరెత్తించారు. 'పోయిరా గౌరమ్మా. పోయిరావమ్మా' అంటూ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత వాయినాలు ఇచ్చుకుని, సంబురంగా ఇంటి దారి పట్టారు.