నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని మంత్రి కొండా సురేఖ తెలిపారు. శనివారం వరంగల్ తూర్పులోని రేషన్ దుకాణాలలో లబ్ధిదారులకు సన్న బియ్యం అందించారు. నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన సన్నబియ్యం కార్యక్రమం ఎంతో విజయవంతం అయిందని లబ్ధిదారులు కూడా దానిని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.