వరంగల్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం మామునూరు ఎయిర్ పోర్టు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనుల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ప్రణాళిక బద్దంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. జి. ఓ ల ననుసరించి అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయుటకు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.