స్టేషన్ ఘనపూర్: కడియం విమర్శించే స్థాయి నీది కాదు
స్టేషన్ ఘనపూర్ లో శుక్రవారం కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీపై, కడియం శ్రీహరిపై రాజయ్య బురద చల్లడం విడ్డూరం అన్నారు. మీడియా సమావేశాలు పెట్టి దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. భూములు కబ్జా చేస్తున్నారని నిరాధారణమైన ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఉంటే నిరూపించు ఒప్పుకుంటాం అన్నారు. పార్టీని విమర్శించే హక్కు నీకు లేదు, కడియం విమర్శించే స్థాయి నీది కాదన్నారు.