పేద ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం జఫర్గడ్ లో కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. 30 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 30లక్షల 3వేల 490 రూపాయల విలువగల చెక్కులను, అలాగే 34మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 10 లక్షల 56వేల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.