ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం కనకదుర్గ కాలనీతో పాటు పలు కాలనీల్లో పర్యటించి కుల గణన సర్వేను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పర్యవేక్షించారు. ఎన్యుమరేటర్లకు 53 అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. సర్వేను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.