జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రానికి చెందిన బోయిని కుమార్ తండ్రి (రాములు) 23/03/23. రోజున వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. తోటి గీత కార్మికులు కుటుంబ సభ్యులు కలసి జనగామ ఏరియా హాస్పటల్ కు తీసుకుపోయారు. ఈ విషయం తెలియగానే కల్లుగీత కార్మిక యువజన సంఘం సభ్యులు జారి పడిన చెట్టు (చెన్నూరి ఉపేందర్ ) బావి దగ్గరికి స్థలానికి వెళ్లి పరిశీలించి వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ కల్లుగీత కార్మికుడు బోయిని కుమార్ కు కాలు విరుగగా చేతులు లాకు దెబ్బలు తగిలాయి. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.