స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గం లింగాల గణపురంలో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
బిజెపి శ్రేణులు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు కెమెడీ పరశురాములు, ముత్యాల కృష్ణ, కేలపు నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి ఏదునూరి నాగరాజు పాల్గొన్నారు.