భారీగా గుట్కా ప్యాకెట్స్ పట్టివేత

78பார்த்தது
భారీగా గుట్కా ప్యాకెట్స్ పట్టివేత
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం స్థానికంగా ఉన్న మూడు కిరాణం జనరల్ స్టోర్ లలో ఆకస్మిక దాడులు నిర్వహించి రెండు లక్షల 50 వేల విలువ చేసే గుట్కా, తదితర పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி