జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పుల మండలం గొల్లపలి శివారులో ఆదివారం వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ లోని రాగితీగను దొంగలు చోరీ చేశారు. దీనిపై విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం అందించామని, నూతన నియంత్రికను ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. రాగి రేటు అధికంగా ఉండడం వల్ల దొంగలు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులోని రాగి వైరును దొంగిలిస్తున్నారని స్థానికులు తెలిపారు.