ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ కు చెందిన సొంత కార్యాలయం ఆదివారం రాత్రి విద్యుదాఘాతంతో దగ్దమైంది. రామస్వామికి చెందిన భవనంలోని ఒక గదిలో స్థిరాస్తి వ్యాపార కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కార్యాలయం నుంచి దట్టమైన పొగలు వచ్చి పేలుడు శబ్దం వచ్చింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఆరు సీసీ కెమెరాలు, దస్త్రాలు, సామాగ్రి దగ్గమైంది.