తెలంగాణ రైతు కూలీ సంఘం వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో మంగళవారం నర్సంపేట ఆర్డిఓ కు మెమోరాండం అందజేశారు. కేంద్రప్రభుత్వం పత్తి సీసీఐ ద్వారా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పత్తి వేసిన రైతులకు కన్నీళ్లు, కడగండ్లు తప్పడం లేదని, మార్కెట్ పత్తిని సీసీఐకి అమ్ముదామంటే అనేక షరతులు విధించి ఆంక్షలు మూలంగా మధ్య దళారిల దోపిడీకి గురికావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.