వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం రాయరాకుల సతీష్ అనే వ్యక్తి ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేసే ఐరన్ బాక్స్ వల్ల ప్రమాదం జరిగి ఇంట్లో వస్తువులు కాలిపోయాయి. ఉదయం ఇస్త్రీ చేస్తుండగా కరెంట్ పోవడంతో ఆ స్విచ్ బంద్ చేయకుండా ఫంక్షన్ కు వెళ్లారు. కరెంటు రావడంతో ఇస్త్రీ పెట్టె బాగా వేడి కావడంతో బట్టలు అంటుకున్నాయి. చుట్టు పక్కల వారు ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు.