వరంగల్ జిల్లా మున్సిపాలిటీ లో నర్సంపేట మున్సిపాలిటీలో 9 గ్రామాల విలీనానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరం, రాములు తండ, రాజపల్లి, ముగ్దుంపురం, నాగులపల్లి, మాదన్నపేట, పరుశునాయక్ తండ, ముత్తుజిపేట, రాజుపేట గ్రామాలను మున్సిపాలిటీలో కలిపేందుకు గతంలోనే ప్రతిపాదనను పంపారు. దీంతో పట్టణంలో సుమారు 70వేలకు జనాభా చేరనుంది. ఇదిలా ఉండగా విలీనం అయితే నర్సంపేట మండలంలో 18గ్రామాలే ఉండనున్నాయి.