పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా బుధవారం నిర్వహించుకునే ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు మంత్రి సీతక్క పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలని సీతక్క అన్నారు.