ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక శివారులో గిరిజనులు వేసుకున్న గుడిసెలను సోమవారం అటవీ శాఖ అధికారులు తొలగించారు. రొయ్యూరు, శంకరాజుపల్లి గ్రామాల్లోని గిరిజనులు గత కొంతకాలంగా ఫారెస్ట్ భూముల్లో వేస్తున్న గుడిసెలు, గుడిసెలు వేయొద్దు అంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చిన అటవీశాఖ అధికారులు, నోటీసులను లెక్కచేయక పోవడంతో జేసిబి సహాయంతో గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు.