ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఆధునాతన ఆయుధాల పని విధానం పై స్కూల్ విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆయుధ ప్రదర్శనను ఆసక్తిగా గమనించి పలు సందేహాలు అడిగి తెలుసుకున్నారు.