రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క శనివారం భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు, ఇతర కీలక అంశాలపై కాసేపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మంత్రి సీతక్క చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.