తెలంగాణలో గత తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మంత్రి సీతక్క బుధవారం సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసారు. రోజుకు రూ. 207కోట్ల వడ్డీలే చెల్లించాల్సి వస్తోందని, నెలకు సగటున రూ. 6వేల కోట్లు వడ్డీలకే సరిపోతోందన్నారు. రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పులు ఏమైనట్లు అని కేటిఆర్ చేసిన ట్వీట్పై మంత్రి ఇలా స్పందించారు.