పాఠశాలల తనిఖీ చేసిన తొలిమెట్టు సందర్శన బృందం

1664பார்த்தது
పాఠశాలల తనిఖీ చేసిన తొలిమెట్టు సందర్శన బృందం
బుదవారం ఉదయం 10: 30 గంటల నుండి 12: 30 గంటల వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి కాంప్లెక్స్ పరిధిలోని బాడ్వ తండా మరియు శనిగకుంట తండాల్లో గల రెండు ప్రాథమిక పాఠశాలలను తొలిమెట్టు భోధన అభ్యాసన సామగ్రి తో భోధన చేసే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనే విషయమై మరిపెడ సందర్శన బృందం సందర్శించారు . ఈ బృందంలో అనంత రావు మరియు వెంకన్న ఉన్నారు. ఈ రెండు పాఠశాలల్లోని విద్యార్థులు చాలా చురుగ్గా చదువుతున్నారని, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు చాలా చక్కగా పాటిస్తూ బోధన చేయడం వలన మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని వారు తెలిపారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ ఐదు తరగతుల విద్యార్థులకు మంచి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు .అదే విధంగా అన్ని రకాల రిజిస్టరు పుస్తకాలు రాయడం ఈ క్రమంలో వారు మానసిక ఒత్తిడికి గురవుతారని తద్వారా వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు కాబట్టి, విద్యాశాఖ ఈ విషయం గురించి ఆలోచించి ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలలో మరో ఉపాధ్యాయుడిని లేదా వాలింటర్లను నియమించడం ద్వారా వారికి కాస్త మానసిక ఒత్తిడి తగ్గించి విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించే అవకాశం ఇవ్వాలని వారు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி