తుంగతుర్తి నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ గా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామానికి చెందిన రామడుగు నవీన్ నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ
కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా స్టేట్ కో కోఆర్డినేటర్ పెట్టెం నవీన్ నియామక పత్రం విడుదల చేశారు.
గత దశాబ్ద కాలంగా రామడుగు నవీన్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా క్రియాశీలకంగా పని చేస్తూ కొనసాగుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై ఆయన
కాంగ్రెస్ సిద్ధాంతాలను, భావజాలాన్ని బలంగా చాటుతూ
కాంగ్రెస్ లో తనదైన ముద్ర వేసుకున్నారు.
ఈ సందర్భంగా రామడుగు నవీన్ మాట్లాడుతూ. తన ఎన్నికకు సహకరించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి, సూర్యాపేట జిల్లా
కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ కు, రాష్ట్ర
కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణా రెడ్డికి, తుంగతుర్తి నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గుడిపాటి నర్సయ్యకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నియోజకవర్గంలో
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను సోషల్ మీడియా ద్వారా మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.