జనవరి 1న మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ఆమె పుట్టినరోజు వేడుకలను తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ, ఉద్యమాలకు నిలయం అయిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు రాష్ట్ర గిరిజన విద్యార్ది సంఘం-ఓయూ జెఎసి అధ్యక్షులు లింగా నాయక్ అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో కేక్ కట్ చేసి, ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగా నాయక్ మాట్లాడుతూ నిరంతర శ్రమ జీవి, అనునిత్యం మహబూబాబాద్ ప్రజల అభివృద్ది కొరకు పరితపించే నాయకురాలు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం-ఓయు జెఏసి నాయకులు తేజా చక్రవర్తి నాయక్, ప్రేమ్ కుమార్, శ్రీను నాయక్, నవీన్, రమేష్, చందు నాయక్, అంగోత్ రవి, మోహన్, బాలాజీ, నరేశ్, భాలు, తదతరులు పాల్గొన్నారు.