ఓపెన్ జిమ్ లో సరదాగా కాసేపు!

896பார்த்தது
ఓపెన్ జిమ్ లో సరదాగా కాసేపు!
మహబూబాబాద్ పట్టణంలోని 9వ వార్డు పరిధిలో 13.60 లక్షల రూపాయలతో నిర్మించిన పార్కు, ఓపెన్ జిమ్ అలాగే 8.00 లక్షల నిధులతో నిర్మించిన పట్టణ ప్రకృతి వనంను బుధవారం మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రాంమోహన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు సరదాగా కాసేపు ఓపెన్ జిమ్ లోని పరికరాలను ఉపయోగించి కసరత్తులు చేసి వ్యాయామం ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, మార్నేని వెంకన్న, 9వ వార్డు కౌన్సిలర్ హరిసింగ్, తెరాస పట్టణ నాయకులు గోగుల రాజు, డౌలాగర్ శంకర్, ఉపేంద్రమ్మ, రాజు, వెంకట్ రెడ్డి, మున్సిపల్ ఏఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி