మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం పెసర, మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ రైతులు అందోళన చేశారు. ఈ నామ్ మొదలు పెట్టకపోవడంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్లో సంబంధిత అధికారులతో వాగ్వివాదానికి దిగారు. మార్కెట్ లో పోసిన పెసర, మొక్కజొన్న, పత్తి ధ్యానం రాశులను వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చ చెప్పి ఆందోళన విరమింపజేశారు.