మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లేదారిలోని షాప్ ల ముందు 11 కేవీ విద్యుత్ వైర్లకు చెట్ల కొమ్మలు తలుగుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం స్థానికులు తెలిపారు. కొమ్మలకు విద్యుత్ తీగలు తలగడం వల్ల ఎర్త్ వచ్చి షాక్ కు గురయ్యే ప్రమాదం ఉన్నందున తక్షణమే కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.