జనగాం జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి 7 ఏండ్ల బాలుడు పై విచక్షణ రహితంగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడి చెవి, తల, ముఖము, చేతులు, కాళ్లపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. శుక్రవారం జనగామ పట్టణం ఇండస్ట్రియల్ కాలనీలో మహత్ అనే ఏడు సంవత్సరాల బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా వచ్చి దాడి చేసి విచక్షణారహితంగా కరిచాయి. స్థానికులు గమనించి వాటిని చెదరగొట్టి ఆసుపత్రికి తరలించారు.