బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని హైదరాబాద్ లోని వారి క్యాంపు కార్యాలయంలో శనివారం జనగాం జిల్లా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి కలిసారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం మరియు తొర్రూరు బస్టాండ్ అభివృద్ధికి నిధుల మంజూరు చెయ్యాలని కోరారు. నిధుల మంజూరు కోసం మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వివరించారు.